బిగ్ బాస్ 4- ఈ వారం మొత్తం 9మంది నామినేషన్ లో ఉండగా.. ఇద్దరు హౌస్ మేట్స్ ఇంటి నుండి బయటకు వచ్చారు. అయితే సుజాత నామినేషన్ లో ఉండి బయటకు రాగా.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గంగవ్వ మాత్రం అనారోగ్యం కారణంగా బయటకు రావాల్సి వచ్చింది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే గంగవ్వ కాస్త డీలా పడిపోయి బయటకు వెళ్తా అని కన్నీరు పెట్టింది. అయితే అప్పుడు బిగ్ బాస్ సర్ది చెప్పడంతో ఎలాగొలా 4 వారలు నెట్టుకొచ్చేసింది. అయితే ఇప్పుడు అక్కడ వాతావరణానికి ఉండలేక కాస్త అనారోగ్యానికి గురవ్వడంతో.. ఆమె ఆరోగ్యం బాగుండటం లేదని డాక్టర్లు రిపోర్టు ఇవ్వడంతో.. బిగ్‌బాస్ పర్మిషన్ తీసుకున్న నాగార్జున, గంగవ్వను బయటకు తీసుకొచ్చారు. “పదిరోజులుగా నిద్ర పోతలేను. ఇల్లు లేదని వచ్చాను. కానీ నా వల్ల ఐతలేదు. ఆట కూడా ఆడలేకపోతున్నా. నన్ను ఊరు పంపించేయండి. నీకు మనుమరాలు పుట్టినప్పుడు హైదరాబాద్ వచ్చి మీ ఇల్లు చూస్తా” అని అంది. ఇక ఇంటిసభ్యులందరూ సగౌరవంగా వీడ్కోలు పలుకగా గంగవ్వ బయటకు వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అప్పటిదాక కాస్త డల్ గా ఉన్న గంగవ్వ బయటకి వచ్చేసరికి ఒక్కసారిగా యాక్టీవ్ అయిపోయింది . అంతేకాదు స్టేజ్ మీదికి వచ్చాక గంతులు వేసింది. ఈ సందర్భంగా ఒక్కొక్క హౌస్ మేట్ గురించి అడుగగా.. అందరిగురించి చెప్పింది గంగవ్వ. ఇంకా చివరిగా హౌజ్ నుంచి బయటకు వచ్చే సమయంలో బిగ్‌బాస్ తనకు ఇల్లు కట్టించాలంటూ గంగవ్వ కోరింది. ఏ కోరికతో ఈ షోలో అడుగు పెట్టిందో ఆ కలను నిజం చేస్తానని.. తాను ఇల్లు కట్టిస్తానని, ఇక దాని గురించి మర్చిపోమని నాగ్ ప్రామిస్ చేసి పెద్ద మనసు చాటుకున్నాడు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























