సుధా కొంగర దర్శకత్వంలో సూర్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం థియేటర్స్ లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీ లోనే రిలీజ్ చేయాలని సూర్య నిర్ణయించుకున్న సంగతి కూడా తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 30న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అక్టోబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారట.
కాగా అపర్ణ బాల మురళి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, పరేష్ రావల్, ఊర్వశి, కరుణాస్ కీలక పాత్రలు పోషించారు. 2డి ఎంటర్టైన్మెంట్, శిఖ్య ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సూర్య, గునీత్ మోంగా సంయుక్తంగా నిర్మించారు. ఎయిర్ డెక్కన్ అధినేత గోపీనాథ్ జీవితగాథను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రమిది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























