మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థంఇప్పటికే జరిగిన సంగతి తెలిసిందే. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్యతో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. మరి కొద్ది రోజులలో పెళ్ళి పీటలెక్కనుంది. అయితే కొద్ది రోజులలో బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్న నేపథ్యంలో గోవాకు తన స్నేహితులతో వెళ్ళిన నిహారిక అక్కడ బ్యాచిలర్ పార్టీ జరుపుకుంది. ఈ సందర్భంగా ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడుపుతున్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది నిహారిక.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా ఇంట అల్లుడిగా అడుగుపెట్టబోతున్న జొన్నలగడ్డ చైతన్య.. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు. మెగా ఫ్యామిలీతో ఈ కుటుంబానికి ఎప్పటి నుంచో పరిచయం ఉందట. ఇండియన్ స్కూల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేసిన చైతన్య ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు.
ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన మెగా హీరోయిన్ నిహారిక ఆసినిమాలో తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహా రెడ్డి చిత్రాలలో నటించింది. నిహా నటించిన తమిళ సినిమా ఒకటి విడుదలకు సిద్ధంగా ఉంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























