కె.జి.యఫ్ సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఈ కరోనా వచ్చి నిరాశనే మిగిల్చింది. ఇక ప్రస్తుతం కె.జి.యఫ్2 సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి షూటింగ్ పూర్తయ్యేది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు ఈ షూటింగ్ లో రాఖీ భాయ్ కూడా అడుగుపెట్టాడు. ఇక ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా తెలిపాడు. అంతేకాదు అలలను ఆపడం కష్టం.. కానీ ఆ అలలలో ఈదడం నేర్చుకోవచ్చు.. చాలా గ్యాప్ తర్వాత కె.జి.యఫ్2 లో షూట్ కు రెడీ అవుతున్నా అంటూ ఇన్స్టా లో పేర్కొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
Waves can’t be stopped but you can learn to sail.. After a long break.. Rocky sets sail from today.
ఇక ఈ షూటింగ్ లో ఆయనతో పాటు సంజయ్ దత్ కూడా పాల్గొంటారని సమాచారం. లంగ్ క్యాన్సర్ బారిన పడిన ఆయన చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నెల చివరికల్లా ‘కె.జి.యఫ్-2’ షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేయడంతో తన వల్ల షూటింగ్ లేట్ అవ్వకూడదన్న నేపథ్యంలో షూటింగ్ చేయడానికి ముందుకొస్తున్నారట సంజయ్. మరి థియేటర్స్ తెరుచుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాదే సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో.
కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























