సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అతనే విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. పౌరాణిక చిత్రాల్లో అయితే ఆయన కృష్ణుడి వేషం వేస్తే ఆయనే కృష్ణుడు.. రాముడు వేషం వేస్తే రాముడు.. రావణుడు అయితే రావణుడు.. అర్జునుడు, శివుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.. ఏ పాత్ర అయినా అది ఆయన కోసమే పుట్టినట్టు ఉంటుంది. నటుడిగానే కాకుండా..దర్శకుడిగా..నిర్మాతగా స్టూడియో అధినేతగా…రాజకీయ వేత్తగా….ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎన్టీఆర్ సాధించిన రికార్డ్స్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా సరిపోదు. ఇప్పట్లో ఏడాదికి ఒక సినిమా తీసి రిలీజ్ చేసేవాళ్ళు కాదు కదా అప్పట్లో. ఏడాదికి తక్కువలో తక్కువ ఐదు సినిమాలైనా రిలీజ్ అయ్యేవి. ఎన్టీఆర్ తొలి ఇరవై ఏళ్లలోనే 200 సినిమాలు చేసారు. అంటే ఏడాదికి సగటున 10 చిత్రాలు ఆయనవి విడుదలయ్యేవి అన్నమాట. మరి వీటిలో చాలా వరకు విజయాన్నే సొంతం చేసుకునేవి.
అయితే ఈ రికార్డ్స్ లో ఎన్టీఆర్ కు, విజయవాడకు మాత్రం ఒక యూనిక్ రికార్డ్ ఉందని చెప్పొచ్చు. అదేంటంటే.. ఎన్టీఆర్ సినిమాల్లో 152 సినిమాలు 100 రోజులకు పైగా ఆడిన సినిమాలు ఉన్నాయి. వాటిలో 128 సినిమాలు ఒక్క విజయవాడలోనే 100 రోజులు పూర్తి చేసుకొని రికార్డు సాధించారు. ఇంకా మరే హీరోకు అలాంటి రికార్డ్ ఇంతవరకూ లేదు. ఇకపై కూడా రాదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మొత్తానికి ఎన్టీఆర్ తన 44 ఏళ్ళ సినీ జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు, 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెర పై చెరగని ముద్ర వేసారు. ఏమైనా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్టీఆర్ ది తిరుగులేని ప్రస్థానం అనే చెప్పాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























