భక్తి పారవశ్యం లో రామ్ చరణ్

Vinayaka Chavithi Celebrations at Chiranjeevi And Ram Charan's Home

మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ , పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో యాక్షన్ సీన్స్ , డ్యాన్స్ లలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్ ఎంటర్ టైనర్ “మగధీర ” రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1000 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. 2 నేషనల్ , 6 ఫిల్మ్ ఫేర్ , 9 నంది , 10 సినీమా అవార్డ్స్ స్వంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన “రచ్చ “, “నాయక్ “, “ఎవడు “, “ధృవ “, “రంగ స్థలం ” మూవీస్ ఘనవిజయం సాధించాయి.హీరో రామ్ చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా “ఖైదీ నెం 150 “, సైరా నరసింహా రెడ్డి ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా “ఆచార్య ” మూవీని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. వినాయక చతుర్థి సందర్భంగా రామ్ చరణ్ తన ఇంటిలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ ఫొటో ను రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. భక్తి పారవశ్యం లో రామ్ చరణ్ వినాయకుని కి నమస్కరిస్తున్న ఆ ఫోటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.