కింగ్ నాగార్జున , దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన “శివమణి” (2003 ), “సూపర్ “(2005 ) మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో ఏ మూవీ తెరకెక్కలేదు. 15 సంవత్సరాల తరువాత ఇప్పడు పూరి జగన్నాథ్ , నాగార్జున హీరోగా ఒక మూవీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు , ఆ ప్రపోజల్ కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాగార్జున ప్రస్తుతం “వైల్డ్ డాగ్ “(తెలుగు ), “బ్రహ్మాస్త్ర “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. ఈ మూవీస్ కాకుండా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్ని నాయనా ” మూవీ కి సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ తెరకెక్కే అవకాశం ఉంది. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” తరువాత పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ “రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం కానున్నారు. పూరి జగన్నాథ్ , నాగార్జున కాంబినేషన్ లో మూవీ రూపొందనుందనే వార్త అభిమానులలో సంతోషం కలిగించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































