టాలెంట్ ముఖ్యం – జాన్వీ కపూర్

Janvi Kapoor Says Talent Is Only Important

లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సూపర్ హిట్ “ధడక్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కార్గిల్ వార్ లో పాల్గొన్న మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన “గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ ” హిందీ మూవీ OTT ద్వారా నిన్న రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ కపూర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్టార్ హీరోలు హృతిక్ రోషన్ , సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వారసత్వం తో చిత్ర పరిశ్రమ లో ఎంతో కాలం మనలేమని , సుదీర్ఘ కాలం చిత్ర సీమ లో రాణించాలంటే టాలెంట్ ముఖ్యమని జాన్వీ చెప్పారు. వృత్తి పరంగా వచ్చే విమర్శలపై జాన్వీ మాట్లాడుతూ .. నటనతో ప్రేక్షకులను మెప్పించడంపైనే ఫోకస్ పెడతానని , సోషల్ మీడియా లో వచ్చే విమర్శలకు భయపడనని , విమర్శలతో కెరీర్ పరంగా జరిగే తప్పులను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తానని , సవాల్ విసిరే పాత్ర లున్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటానని , తాను నటించే ప్రతీ మూవీ లో కొత్త విషయాలు నేర్చుకొనడానికి ఆరాటపడతానని , తనను తాను నిరూపించుకొనడానికి ఎంతైనా కష్టపడతానని జాన్వీ చెప్పారు. జాన్వీ హీరోయిన్ గా నటించిన “రూహి అఫ్జానా” మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. “దోస్తానా 2 “మూవీ చిత్రీకరణ దశలో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.