హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దానికితోడు ఈ కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఓటీటీలోనే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారని అన్నారు..అయితే దీనిపై స్పందించిన చిత్రయూనిట్ అదేం లేదు థియేటర్ లోనే సినిమాను రిలీజ్ చేస్తాం అని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు చూడబోతే సినిమా థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించట్లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికే థియేటర్లు తెరుచుకునే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా రిలీజ్ పై కోన వెంకట్ ఒక ప్రశ్న సంధించారు. `మీరు థియేటర్ల కోసం జనవరి లేదా ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సి వస్తే… `నిశ్శబ్దం` చిత్రాన్ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు. ‘ఓటీటీ’, ‘థియేటర్స్’ ఎక్కడ చూడాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. మరి మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు..?
If u have to wait till January or February for theatres..
Where do u want to see NISHABDHAM ?— kona venkat (@konavenkat99) August 10, 2020
కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































