గత మూడు నాలుగు రోజుల నుండి రానా-మిహికా ల పెళ్లి సందడి చూస్తూనే ఉన్నాం. హల్దీ ఫంక్షన్, మెహందీ, పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. మొత్తానికి నిన్న రాత్రి రానా- మిహికాల వివాహం రామానాయుడు స్టూడియోలో అతికొద్ది సన్నిహితుల మధ్య జరిగిపోయింది. ఇక ఈ వివాహానికి సమంతా, నాగ చైతన్య, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసనలు కూడా హాజరయ్యారు. ఇక వీరికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఈ పెళ్లి సందడి మొదలైనప్పటి నుండి ఇప్పటివరకూ ఎన్నో ఫొటోలు బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు ఒక ఫొటోకు మాత్రం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ ఫొటో ఎవరిదో కాదు నాగ చైతన్య-సమంతది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రానా పెళ్ళిలో సమంత – నాగ చైతన్యల సందడి చూస్తూనే ఉన్నాం. రానా-మిహికా తర్వాత స్పెషల్ అట్రాక్షన్ చైసామ్ లదే.
ఇక ఈ పెళ్ళిలో సమంత కాస్ట్యూమ్ మరో ప్రత్యేకం. డిజైనర్ శారీస్, కాస్ట్లీ జ్యువెల్లరీతో మెరిసిపోయింది సామ్. తన ఫొటోలను సమంత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా అభిమానులు లైకులు, కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు చేనేత దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ కావడంతో సమంత ఆయన భర్తతో కలిసి చేనేత దుస్తులలో తళుక్కుమంది. పెళ్లి తర్వాత జరిగే వ్రతం వేడుకలో సమంత గ్రీన్ కలర్ చేనేత శారీ ధరించగా, నాగ చైతన్య తెల్లటి దుస్తులు ధరించారు. ఈ సందర్భంగా తీసిన చైసామ్ ఫొటో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సమంత సీరియస్ గా మాట్లాడుతుంటే చై సమంత తలమీద తలంబ్రాలు వేస్తున్నాడు. ఇక ఈ ఫొటోకు ‘పిక్చర్ పర్ఫెక్ట్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే చూడటానికి చాలా క్యూట్ గా ఉంది ఈ పిక్.
వీరితో పాటు దగ్గుబాటి ఫ్యామిలీ కూడా చేనేత దుస్తులని ధరించారు. వెంకటేష్, సురేష్ బాబు పంచెలలో కనిపించగా, మిగతా వారందరు చీరలలో మెరిసారు.
ఇక ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమాలో చేస్తున్నాడు. ఇక సామ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాతోపాటు సామ్ ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది సామ్. మరోవైపు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: