సక్సెస్ ఫుల్ చిత్ర సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ టాలీవుడ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “కిక్ ” మూవీ లో సంగీతానికి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి థమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. థమన్ సంగీతం అందించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. థమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ సంగీత దర్శకుడు. సంగీతం తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా థమన్ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
థమన్ స్వరకల్పనలో రూపొందిన “అల .. వైకుంఠపురములో .. “మూవీ సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. ఆ సాంగ్స్ లో “బుట్ట బొమ్మా “, “సామజవరగమనా” పలు రికార్డ్స్ క్రియేట్ చేశాయి. థమన్ ప్రస్తుతం ” V” , “మిస్ ఇండియా “, వకీల్ సాబ్ “, “సోలో బ్రతుకే సో బెటర్ “, “క్రాక్ “, “టక్ జగదీష్ “, “NBK106” , వరుణ్ తేజ్ “VT 10” , “సర్కారు వారి పాట ” మూవీస్ కు సంగీతం అందిస్తున్నారు. ఎప్పటికైనా మ్యూజిక్ స్కూల్ ప్రారంభించాలని తన కల అని , ఆ మ్యూజిక్ స్కూల్ డబ్బు సంపాదనకు కాకుండా సంగీతం మీద ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా సంగీతం నేర్పిస్తానని థమన్ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: