బిచ్చగాడు సినిమా విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. విజయ్ ఆంటోనీకి తెలుగులో క్రేజ్ సంపాదించిన సినిమా అది. తెలుగు రాష్ట్రాలలో రూ.10 కోట్ల వరకూ వసూలు సాధించిం నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టింది. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అంటే మాములు విషయం కాదు. ఇక ఆ తర్వాత ఏ సినిమా ఆ రేంజ్ లో విజయం తెచ్చిపెట్టలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి బిచ్చగాడు 2 తో రావడానికి సిద్దమయ్యాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమా సీక్వెల్‌కు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేసాడు. అంతెేకాదు దానికి సంబంధించిన తెలుగు, తమిళ పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేసాడు. 2021లో విడుదల చేయనున్నట్టు పోస్టర్లో ప్రకటించారు.
#pichaikkaran2 #Bitchagadu2 pic.twitter.com/hsaEdEURMO
— vijayantony (@vijayantony) July 24, 2020
కాగా బిచ్చగాడు చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మించగా.. శశి డైరెక్ట్ చేసాడు. ఈ సీక్వెల్‌ను మాత్రం ప్రియ కృష్ణ స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ ఆంటోని నిర్మిస్తున్నాడు. మరి బిచ్చగాడు ఘన విజయం అందించింది.. ఇప్పుడు ఈ సీక్వెల్ విజయ్‌కి మరో విజయాన్ని అందిస్తుందా? లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
దీనితో పాటు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ‘తమిళరసన్’, ‘అగ్ని సిరగుగళ్’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా… కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























