ఢిల్లీ టు హైదరాబాద్

Actress Rakul Preet Singh Heads To Hyderabad From Delhi To Join Movie Shoot

పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ హోదా అందుకున్నారు. రకుల్ నటించిన “దే దే ప్యార్ దే “, “మర్జావాన్ ” హిందీ మూవీస్ ఘనవిజయం సాధించడంతో హిందీ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. రకుల్ ప్రస్తుతం “ఎటాక్ “, “ఛలే ఛలో ” హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. తమిళ భాషలో “ఇండియన్ 2”, అయిలాన్ “, తెలుగు లో నితిన్ హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ లో ముంబై లో ఇంటికి పరిమితం అయిన రకుల్ వర్కౌట్స్ , కుకింగ్ , సోషల్ మీడియాలో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేశారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత తన బ్రదర్ తో ఢిల్లీ లోని స్వంత ఇంటికి రకుల్ చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కొన్ని రోజులు ఎంజాయ్ చేసిన రకుల్ తన బ్రదర్ తో హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ లో రకుల్ కు జూబ్లీ హిల్స్ లో స్వంత ఫ్లాట్ , F 45 పేరు తో జిమ్ ఉన్న విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాలలో కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా ఉండడం , షూటింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో హీరోయిన్స్ హైదరాబాద్ ను చేరుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.