సెలబ్రిటీస్ పిల్లలు ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. సెలెబ్రటీస్ కూడా తమ పిల్లల ఫొటోస్, వారితో ఆడే వీడియోస్ లాంటి స్వీట్ మెమోరీస్ ను ఎప్పటికప్పుడు తమ ట్విట్టర్ లో కానీ… ఇన్స్టా లో కానీ పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. అయాన్, అర్హ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే వుంటారు బన్నీ,స్నేహ రెడ్డి. ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయాన్, అర్హలు కలర్ ఫుల్ రెయిన్ కోట్ ధరించి గార్డెన్ లో ఆడుకుంటూ వర్షంలో నిలుచొని ఉన్నారు. ఇక ఈ ఫొటోను ను తీసి స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పుష్ప’ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పరిస్థితులు కాస్త మెరుగుపడిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: