“పెళ్ళి చూపులు “, “అర్జున్ రెడ్డి “, “గీత గోవిందం ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడి విజయ్ పై క్రేజ్ పెరిగింది. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “ఫైటర్ “(వర్కింగ్ టైటిల్ ) లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన విజయ్ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ రీసెంట్ గా ఫిల్మ్ నగర్ లో ఒక ఇంటిని కొనుగోలు చేసి గృహ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తానే లేటెస్ట్ డిజైన్స్ సెలెక్ట్ చేసి ఇంటీరియర్ డెకరేషన్ చేయిస్తున్నారు. తన టేస్ట్ తో పాటు తన తల్లిదండ్రుల టేస్ట్ కు అనుగుణంగా ఇంటీరియర్ వర్క్స్ చేయిస్తూ విజయ్ బిజీగా ఉన్నారు . దర్శకులు శివ నిర్వాణ, మోహన్ కృష్ణ ఇంద్రగంటి మూవీస్ కు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























