బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ నేడు తుది శ్వాస విడిచారు. ఇక సరోజ్ ఖాన్ మరణంతో బాలీవుడ్ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. బాలీవుడ్ నటీ నటులు సరోజ్ ఖాన్ మృతిపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు సరోజ్ ఖాన్ మృతిపై టాలీవుడ్ నుండి కూడా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల కెరీర్లో 2000కి పైగా సినిమాలకి కొరియోగ్రఫీ చేసిన సరోజ్ ఖాన్ కొన్ని తెలుగు సినిమాలకి కూడా పని చేసింది. జెంటిల్ మెన్, క్రిమినల్, చూడాలని ఉంది, దేవి పుత్రుడు, టక్కరి దొంగ, పల్నాటి బ్రహ్మనాయుడు, అంజి, బాలు ఇంకా ఆట సినిమాలకు కొరియోగ్రఫీ అందించారు.
ఈ నేపథ్యంలో గుణశేఖర్ సంస్థ కూడా తమ ట్విట్టర్లో చూడాలని ఉంది సాంగ్ కొరియోగ్రఫీ వీడియో షేర్ చేస్తూ నివాళులు అర్పించింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చూడాలని ఉంది చిత్రంలో ఓమ్మారియా ఓమ్మారియా అనే సాంగ్‌కి సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ అందించారు. చిరంజీవి, సౌందర్య వేసిన స్టెప్స్ అప్పట్లో ట్రెండ్ సెట్ చేసాయి. అంతేకాదు ఈ పాటకు గాను సరోజ్ ఖాన్ కు అవార్డ్ కూడా వచ్చింది.
We miss you ##SarojKhan #ChoodalaniVundi #BestChoreography #NandiAward @KChiruTweets @VyjayanthiFilms @Gunasekhar1 pic.twitter.com/biKqu4ILUC
— Gunaa Teamworks (@GunaaTeamworks) July 3, 2020
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: