మలయాళం సూపర్ హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్ ” సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రీమేక్ హక్కులను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎప్పుడో సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో రానా దగ్గుబాటి మాస్ మహారాజ్ రవితేజ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ‘స్వామిరారా’ సినిమాతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ వర్మకు ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నారని టాక్. తెలుగు ప్రేక్షకులను మెప్పించేలా కథ లో కొన్ని మార్పులు చేయనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టు నుంచి మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా అన్ని పనులు త్వరలో పూర్తి చేసి ఆగష్ట్ నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు గురించి త్వరలోనే తెలియచేయనున్నారు.
కాగా, ‘అయ్యప్పనుమ్ కొషియం’ మంచి యాక్షన్ థ్రిల్లర్. పృథ్విరాజ్ సుకుమారన్, బిజు మీనన్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాకు సాచీ దర్శకత్వం వహించారు. రిటైర్డ్ ఆర్మీ హవల్దార్ అయ్యప్పన్ నాయర్‌గా పృథ్వీరాజ్, పోలీస్ ఆఫీసర్ కొషీ కురియన్ బిజు మీనన్ నటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































