తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన రాశీఖన్నా తమిళ భాష, గిటార్ నేర్చుకుంటూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం “అరణ్మణై 3″మూవీ లో నటిస్తున్నారు. సూర్య హీరోగా రూపొందే “అరువా “, పా .విజయ్ దర్శకత్వంలో రూపొందే “మేధావి ” తమిళ మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




గాయకురాలిగా రాశీఖన్నా “జోరు “, “బాలకృష్ణుడు “, “జవాన్ “, “ప్రతి రోజూ పండగే “, విలన్ (మలయాళ ) మూవీస్ లో సాంగ్స్ పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాశీఖన్నా ఇప్పుడు అమెరికన్ గాయని బిలీ ఐలిష్ సాంగ్ ను గిటార్ ప్లే చేస్తూ పాడి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు . రాశీఖన్నా మాట్లాడుతూ .. గిటార్ నేర్చుకొనడం తాను పాజిటివ్ గా ఉండడానికి హెల్ప్ చేసిందని , గిటార్ పట్టుకున్న ప్రతి సారీ తన వదనం లో చిరునవ్వు వస్తుందని , ఈ వీడియో అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నానని , మరో సాంగ్ తో త్వరలోనే మీ ముందుకు వస్తానని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























