ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ‘పెంగ్విన్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా వల్ల రిలీజ్ లన్నీ ఆగిపోయాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ సినిమాను ఆన్ లైన్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు. జూన్ 19వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్ వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా త్వరలోనే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జూన్ 8న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. కాగా స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ స్టూడియోస్ పతాకం పై దర్శకుడు, నిర్మాత కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
She is destined to rise on 19th June!#Penguin Teaser out on June 8th.#PenguinOnPrime #WorldPremiereOnPrime @PrimeVideoIN @KeerthyOfficial @karthiksubbaraj @EashvarKarthic @Music_Santhosh @kaarthekeyens @Sudhans2017 @Stonebenchfilms @PassionStudios_ pic.twitter.com/zASrgBOdoO
— Telugu FilmNagar (@telugufilmnagar) June 6, 2020




కాగా ఈ సినిమాతో పాటు నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో ‘మిస్ ఇండియా’.. అమిత్ శర్మ దర్శకత్వంలో ‘మైదాన్’ సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో ‘గుడ్ లక్ సఖి’ లో నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























