ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. తుఫానులు, వరదలు లాంటివి వచ్చినప్పుడు తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడు మేమున్నామంటూ ముందుకు వస్తూనే ఉంది. ప్రజలకు సాయం అందిస్తూనే ఉంది. ఇప్పుడు కరోనా వల్ల బాధపడుతున్న ఎంతోమందికి కూడా సాయం చేస్తూ పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. ఇంకా అందిస్తూనే ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనిలో భాగంగానే మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా విజయ్ దేవరకొండ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి ‘మిడిల్ క్లాస్ ఫండ్ పేరుతో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై కొన్ని వెబ్సైట్లు తప్పుడు కథనాలు ప్రచురించాయి. అయితే ఇన్నాళ్లు తనపై వచ్చిన వార్తల్ని పట్టించుకోని విజయ్ మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకున్నాడు. ఓ వీడియో రూపంలో తన ఆగ్రహాన్ని మొత్తం చూపించాడు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ వీడియో నే వైరల్ గా మారింది. అంతేకాదు విజయ్ కు కూడా పెద్ద ఎత్తున టాలీవుడ్ నుండి మద్దతు లభించింది.
ఇప్పటికే ఎంతో మంది ఈ వీడియో పై స్పందించగా.. తాజాగా పూరీ జగన్నాథ్ స్పందించి అసహనాన్ని వ్యక్తం చేసాడు. ఆకలితో ఉన్న ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టావ్ నువ్వు. ప్రజలకి సాయం చేయాలనే తపన ఉన్న మీరు విలువైన సమయాన్ని, డబ్బుని ఖర్చు చేశారు. ఈ విషయంలో మిమ్మల్ని గౌరవిస్తాము. ప్రస్తుతం మనం యుద్ధ భూమిలో ఉన్నాము. దీనిపై మనం పోరాడాలి. నువ్వు నా ఫైటర్. నీకు మా మద్దతు ఎల్లప్పుడు ఉంటుంది అని ట్వీట్ చేశారు.
ఆకలితో ఉన్న ఎన్నో కుటుంబాలకి అన్నం పెట్టావ్ నువ్వు 🙏🏽
YOU INVESTED YOUR TIME MONEY AND EFFORT TO MAKE THIS HAPPEN. WE RESPECT YOU FOR THAT. BUT UNFORTUNATELY WE ARE IN A WAR ZONE. AND WE HAVE TO FIGHT BACK. YOU ARE MY FIGHTER💪🏽 WE SUPPORT YOU MAN @TheDeverakonda #KillFakeNews— PURIJAGAN (@purijagan) May 5, 2020
ప్రస్తుతం ఈవీడియో అయితే వైరల్ గా మారింది. సినీ పరిశ్రమ మొత్తం కదిలి వస్తుంది. ఈ సంఘటనతో మరోసారి మేమంతా ఒకటే అని రుజువు చేశారు. మరి దీనితో ఏమైనా చర్యలు చేపడతారేమో చూద్దాం.




విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























