కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ వల్ల అన్ని పరిశ్రమలపై ఎలా ఎఫెక్ట్ పడిందో… చిత్ర పరిశ్రమపై కూడా బాగానే పడిందని. సినిమా షూటింగులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. థియేటర్స్ మల్టీప్లెక్స్ లు మూతబడిపోయాయి. ఎన్నో సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా అవి కూడా వాయిదా పడ్డాయి. అంతేకాదు ఈ లాక్ డౌన్ వల్ల సినీ కార్మికులకు కూడా పని లేకుండా పోవడంతో… ఎన్నో కుటుంబాలు ఉపాధి లేకుండా పోయింది. అయితే వారికి మన సెలబ్రిటీస్ సాయం చేస్తున్నారనుకోండి అది వేరే విషయం. కానీ ఈ లాక్ డౌన్ వల్ల వేల కోట్ల బిసినెస్ ఆగిపోయింది. ఇక టీవీ సీరియల్స్ షూటింగ్ కూడా ఆగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మే 17 వరకు లాక్ డౌన్ ను కొనసాగించారు. ఇప్పటికే జోన్స్ ప్రకారం షరతులు సడలింపు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షూటింగ్ లకు అనుమతి ఇవ్వాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పలువురు కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ తో చర్చలు జరుపుతామని… సింగిల్ విండో పాలసీతో ముందుకు వెళ్తాము… షూటింగ్ విషయంలో తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. జూన్ నుంచి షూటింగ్ లు మొదలయ్యే అవకాశం ఉందని… ఈ విషయంపై రెండు రాష్ట్రాలతో చర్చించి త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తాం” అని తెలిపారట. దీంతో జూన్ నుండి షూటింగ్ లు ప్రారంభం కాబోతున్నాయని.. దర్శక,నిర్మాతలు, నటీనటులు ఇప్పటి నుండే రెడీ అవుతున్నారని సమాచారం.
అయితే సినిమా థియేటర్లు మాత్రం ఇప్పట్లో ప్రారంభించే అవకాశం లేదని అంటున్నారు. దాదాపు ఈ ఏడాది చివరి వరకు థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేదు. షూటింగ్ లకైనా అనుమతి ఇస్తే ఆపనులైనా కంప్లీట్ చేసుకునే పనిలో వున్నారు. చూద్దాం మరి అప్పటివరకూ పరిస్థితులు ఎలా వుంటాయో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: