కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో ‘జగమే తంత్రం’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కి బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని… ఈ కరోనా నుండి ఈ జగం కోలుకున్నాక థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మరి లాక్ డౌన్ వల్ల రిలీజ్ లు ఆగిపోవడంతో పలు సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ క్లారిటీ ఇచ్చినట్టున్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Coming Soon to Cinemas.
After our ‘Jagam’ heals.#JagameThandiram#JagameTantram@dhanushkraja @karthiksubbaraj @sash041075@Music_Santhosh @chakdyn @RelianceEnt @Shibasishsarkar @APIfilms@tridentartsoffl @GA2Official @UV_Creations @IamAntoJoseph@onlynikil @IamEluruSreenu pic.twitter.com/MsDkr77Mie— Y Not Studios (@StudiosYNot) May 1, 2020
వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుండగా… యశ్వంత్ అశోక్ కుమార్, జోజు జార్జ్, జేమ్స్ కాస్మో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. తెలుగులో ఈ సినిమాను ను గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.




దీనితో పాటు మరో సినిమాను సెల్వరాజ్ డైరెక్షన్లో చేస్తున్నాడు ధనుష్. ఈ చిత్రానికి కర్ణన్ అనే పేరు పెట్టారు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ నటి రజిష విజయన్ హీరోయిన్ గా నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























