లాక్ డౌన్ వల్ల ఎక్కడి షూటింగ్ లు అక్కడ.. సినిమా రిలీలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కొన్నిపనులు మాత్రం చేసుకుంటూనే వున్నారు. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు లాంటివి మాత్రం జరుగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక వార్త వినిపిస్తుంది. పుష్ప సినిమాకు దేవి శ్రీ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ లో సగం పాటల్ని దేవి రెడీ చేసేశాడట. అసలు లాక్డౌన్కి తాను ఓ పాట ప్రిపేర్ చేసి, రికార్డింగ్ చేసేసి, చిత్రబృందానికి వినిపించాడట. ఆ పాట విని బన్నీ, సుకుమార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని, ఆ పాటతోనే షూటింగ్ ప్రారంభించాలనుకున్నారని, అయితే లాక్డౌన్ వల్ల ఆ షూటింగ్ ఆగిపోయిందని చెప్పాడు. సుకుమార్, బన్నీల సినిమా అంటే తనకు చాలా ప్రత్యేకం అని, ఈ సినిమాలో సరికొత్త సంగీతం వినే అవకాశం ఉందని, కొత్త తరహా ట్యూన్లు, సౌండింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు దేవి. మరి చూద్దాం ఈ సినిమాతో దేవి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్ గా కేరళ కుట్టి నివేదా పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























