మాస్ మహారాజా సరసన నివేత పెతురాజ్?

Ala Vaikunthapurramuloo Actress Nivetha Pethuraj To Pair Up With Mass Maharaja Ravi Teja In Ramesh Varma Directorial

‘రాక్షసుడు'(2019) రూపంలో కెరీర్ బెస్ట్ హిట్‌ని అందుకున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. త్వరలో మరో యాక్షన్ థ్రిల్లర్‌తో పలకరించబోతున్నాడు. ఇందులో మాస్ మహరాజా రవితేజ కథానాయకుడిగా నటించనున్నాడు. ‘వీర'(2011) తరువాత రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో ఇప్పటికే ఓ హీరోయిన్‌గా నిధి అగర్వాల్ ఎంపికయింది. కాగా మరో హీరోయిన్‌గా టాలెంటెడ్ బ్యూటీ నివేత పెతురాజ్ కన్ఫర్మ్ అయిందని సమాచారం. ఇదివరకు ఈ పాత్ర కోసం మాళవిక శర్మ, నభా నటేష్ వంటి యువ కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడా అవకాశం నివేత చెంతకు చేరిందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే రవితేజ – రమేష్ వర్మ కాంబినేషన్ మూవీలో నివేత పెతురాజ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.