శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “గూఢచారి” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కి సీక్వెల్ గా “గూఢచారి 2” మూవీ రూపొందనుంది. అడివి శేష్ హీరోగా రూపొందనున్న ఈ మూవీ కి “క్షణం”, “గూఢచారి “మూవీస్ కి రైటర్ గా పనిచేసిన రాహుల్ పాకాల దర్శకుడు. లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన యాక్టర్, రైటర్ అడివి శేష్ “గూఢచారి 2” మూవీ స్క్రిప్ట్ వర్క్ లో బిజీ గా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ కృష్ణ నిర్మాణ సారథ్యం లో శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న “మేజర్” మూవీ 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇటీవల బోర్డర్ లో 8 డిగ్రీల టెంపరేచర్ లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. “మేజర్” మూవీ కై రామోజీ ఫిల్మ్ సిటీ లో ఒక భారీ సెట్ ను రూపొందించారు. లాక్ డౌన్ కాలం ముగిసి షూటింగ్స్ ప్రారంభం అయిన తరువాత ఆ సెట్ లో “మేజర్” మూవీ షూటింగ్ జరుగనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























