మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. దాదాపు 30 నిమిషాల నిడివి గల ఈ పాత్ర సినిమాకే ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని సమాచారం. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి దాదాపు 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. అయితే, కరోనా ఎఫెక్ట్‌తో షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆచార్య’ స్టోరీ లైన్‌ను రివీల్ చేశారు చిరు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే.. జనజీవనస్రవంతిలో కలిసిపోయిన ఒక మాజీ నక్సలైట్.. కాలేజీ ప్రొఫెసర్‌గా ఎందుకు మారాడు? ప్రకృతి వనరులను కాపాడుకోవడం కోసం ఆ ప్రొఫెసర్ ఎలాంటి పోరాటం చేశాడు? అనే అంశాలతో ‘ఆచార్య’ తెరకెక్కుతోందట.
రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆచార్య’.. కుదిరితే 2021 సంక్రాంతికి లేదంటే అదే ఏడాది వేసవికి విడుదల కానుందని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రానికి “మెలోడి బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































