పోలీస్ ఆఫీసర్ గా నటిస్తా – విజయ్ దేవరకొండ

I Will Surely Play Police Officer Role In My Movies Says Hero Vijay Devarakonda

కరోనా మహమ్మారి కారణంగా జన జీవనం కష్టాలపాలయింది. ప్రజల ప్రాణ రక్షణ కై తమ ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య బృందాలు, పోలీస్ శాఖ కు కృతజ్ఞతలు తెలపాల్సిందే. పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో హీరో విజయ్ దేవరకొండ కర్తవ్య దీక్షతో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు విజయ్ సమాధాన మిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయం లో ప్రజలు బయటకు రావద్దని చెప్పడానికి మీరు రావాలని అడిగిన పోలీస్ అధికారితో విజయ్ మాట్లాడుతూ .. లాక్ డౌన్ సమయం లో బయట తిరిగేవారికి “మీ ” పద్ధతి లోనే చెబితే మంచిదని, తాను చెబితే మంచి జరుగుతుందంటే తప్పక వస్తానని, ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఇంటిని చక్కబెడుతూ ఉద్యోగాలు చేస్తున్న మహిళా అధికారులకు హ్యాట్సాఫ్ అని, త్వరలోనే పోలీస్ ఆఫీసర్ గా నటిస్తానని , తనది పోలీస్ ఉద్యోగం అయితే గొప్ప బాధ్యతగా స్వీకరించేవాడినని, ఈ సమయం గడిచిపోతుందని మహాభారతం లో కృష్ణుడు చెప్పినట్టుగా ఏ సమయం శాశ్వతం కాదని , కరోనా కూడా అంతేనని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మన జీవితాలలో కరోనా ఒక జ్ఞాపకం గా మిగిలి పోతుందని విజయ్ చెప్పారు. పని వత్తిడి లో ఉన్న తమకు విజయ్ మాటలు నూతనోత్సాహం కలిగించాయని పోలీస్ అధికారులు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.