త్రివిక్రమ్ గారు చెప్పిందే జరిగిందని చెపుతుంది యాంకర్ శ్రీముఖి. మరి త్రివిక్రమ్ ఏం చెప్పారు…ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అసలు స్టోరీ లోకి వెళ్లాల్సిందే. ‘జులాయి’ సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది శ్రీముఖి. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించి.. ఇప్పుడు పూర్తిస్థాయి యాంకర్ గా నిలిచింది. ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకటి. ఇక ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న శ్రీముఖి తన సినీ కెరీర్ గురించి.. సినిమాలు ఆపేసి యాంకరింగ్ నే ఎందుకు కంటిన్యూ చేసింది అన్న విషాలు చెప్పుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఆమె చెపుతూ ‘జులాయి’ చిత్రం చేస్తున్నప్పుడే సినిమాలు వద్దని తన తండ్రి చెప్పారని .. ఈ సినిమానే చివరి చిత్రం కావాలని ఆదేశించారని చెప్పింది. అయితే ఆ తర్వాత రెండు, మూడు ఆఫర్లు రావడంతో ఆ సినిమాల్లో కూడా నటించానని… ఆ తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి, టీవీ షోలతో బిజీ అయ్యానని తెలిపింది. నేను జులాయి సినిమా చేస్తున్నప్పుడే త్రివిక్రమ్ గారు చెప్పారు… బుల్లితెర కే పరిమితమైతే సినిమా అవకాశాలు రావని.. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే జరిగిందని తెలిపింది. ఆ తర్వాత రెండు, మూడు సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించానని .. వాటిలో తన పాత్రకు తగిన ప్రాముఖ్యత లేకపోవడం ఒక కారణమైతే… ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ సీన్లు చేయాలని అడగడం మరో కారణమని చెప్పింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























