స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. అలాంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రాలలో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ఒకటి. ‘విలువలే ఆస్తి’ అనే పాయింట్ తో రూపొందిన ఈ ఫ్యామిలీ డ్రామాలో.. సమంత, నిత్యమీనన్ కథానాయికలుగా నటించారు. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, ఉపేంద్ర, కోట శ్రీనివాసరావు, అలీ, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, సంపత్ రాజ్, ‘వెన్నెల’ కిషోర్, స్నేహ, పవిత్ర లోకేష్, ఆదా శర్మ, సింధు తులాని ముఖ్య పాత్రలు పోషించగా.. ప్రకాష్ రాజ్ అతిథి పాత్రలో మెరిసారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్ గీత రచనకు.. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చారు. “సూపర్ మచ్చి”, “కమ్ టు ద పార్టీ”, “శీతాకాలం”, “జారుకో”, “ఛల్ ఛలో ఛలో”, “వన్ అండ్ టూ అండ్ త్రీ”, “వచ్చాడు” పాటలు అలరించాయి. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చిన బాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. 2015 ఏప్రిల్ 9న విడుదలైన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’.. నేటిలో 5 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























