పవన్ సర్ప్రైజ్ కు ఫుల్ హ్యాపీ లో థమన్

Its a Cloud Nine Moment For Music Director Thaman
Its a Cloud Nine Moment For Music Director Thaman

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనపై అభిమానులకు ఉండే ప్రేమ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యులు మాత్రమే కాదు ఇక పవన్ కు సినిమా సెలబ్రిటీస్ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారిలో థమన్ కూడా ఒకరని మనకు తెలిసిందే. పవన్ వకీల్ సాబ్ సినిమాకు కూడా థమన్ ఏ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఆ సంతోషంలో ఉండగా పవన్ ఇచ్చిన మరో సర్పరైజ్ కు థమన్ ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఇంతకీ పవన్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్ గతకొద్దికాలం క్రిందటే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కూడా పవన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ట్విటర్‌లో పవన్‌ను 39 లక్షల మంది అనుసరిస్తున్నారు. అయితే పవన్ మాత్రం కేవలం 33 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో సినీ పరిశ్రమకు చెందిన వారు అతికొద్ది మంది మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, తన అన్నయ్య చిరంజీవి, రామ్‌చరణ్, సాయిధరమ్ వంటి వారిని మాత్రమే పవన్ ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఎస్ ఎస్ థమన్. థమన్‌ను కూడా చేరిపోయాడు. థమన్ ను పవన్ ఫాలో కొట్టారు. ఇక ఈ విషయాన్ని థమన్ తన ట్విటర్ ద్వారా చెపుతూ ఆనందాన్ని పంచుకున్నాడు.`ఒక అభిమానిగా ఇది నాకు చాలా గొప్ప విషయం. ఒక రోజుకు ఇంతకంటే గొప్ప ప్రారంభం ఇంకేం కావాలి. చాలా కృతజ్ఞతలు.. లవ్యూ సర్` అంటూ థమన్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.