నాగార్జున, సిమ్ర‌న్ సెన్సేష‌న‌ల్ మూవీ `నువ్వు వ‌స్తావ‌ని`కి 20 ఏళ్ళు

Akkineni Nagarjuna And Simran Musical Blockbuster Nuvvu Vasthavani Completes 20 Years

“కాళిదాసు నేనై కవిత రాసుకోనా… కాలిగోటి అంచులపైన హృదయం ఉంచనా”.. ఇలాంటి క‌వితాత్మ‌క‌ భావానికి మంచి సంగీతం కూడా తోడైతే.. ఆ పాటతో పాటు ఆ సినిమా కూడా ప్రేక్ష‌కుల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతుంది. అలా నిలిచిపోయిన చిత్రమే కింగ్ నాగార్జున, డ్రీమ్ గ‌ర్ల్ సిమ్ర‌న్ జంటగా న‌టించిన ‘నువ్వు వ‌స్తావ‌ని’. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘తుళ్ళాద మ‌న‌ముమ్ తుళ్ళుమ్’(విజ‌య్, సిమ్ర‌న్‌)కి రీమేక్‌గా ‘నువ్వు వ‌స్తావ‌ని’ని తెర‌కెక్కించాడు దర్శకుడు వి.ఆర్.ప్ర‌తాప్‌. ఇందులో కోట శ్రీ‌నివాస‌రావు, త‌నికెళ్ళ భ‌ర‌ణి, బ్ర‌హ్మానందం, అలీ, సుధాక‌ర్, మ‌ల్లికార్జున‌రావు, నూత‌న్ ప్రసాద్, ర‌మాప్ర‌భ, సుధ, ర‌ఘు కుంచె, వ‌ర్ష ముఖ్య‌ పాత్ర‌లు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామ‌శాస్త్రి, చంద్ర‌బోస్‌, సుద్దాల అశోక్‌తేజ‌, ఇ.య‌స్.మూర్తి, పోతుల ర‌వికిర‌ణ్ గీత ర‌చ‌న చేయ‌గా.. ఎస్.ఎ.రాజ్‌కుమార్ స్వ‌ర‌సారథ్యంలో రూపొందిన పాట‌లన్నీ చార్ట్ బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా సినిమాలో సంద‌ర్భోచితంగా ప‌లు మార్లు వ‌చ్చే “పాట‌ల ప‌ల్ల‌కివై” అనే పాట విశేషాద‌ర‌ణ పొందింది. అలాగే.. “క‌లలోనైనా క‌ల‌గ‌న‌లేదె”, “కొమ్మా కొమ్మా”, “మేఘ‌మై నేను”, “రైలు బండిని”, “నీవే దేవుడివి”.. వంటి పాట‌లు కూడా ప్రేక్ష‌కుల‌ను అలరించాయి. సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్‌.బి.చౌద‌రి నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని నమోదు చేసింది. 2000 ఏప్రిల్ 5న విడుద‌లైన ‘నువ్వు వ‌స్తావ‌ని’.. ఈ ఆదివారంతో 20 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

`నువ్వు వ‌స్తావ‌ని` – కొన్ని విశేషాలు:

* కింగ్ నాగార్జున కెరీర్‌లో చిర‌స్థాయిగా నిల‌చిన ర‌మ‌ణీయ దృశ్య‌కావ్యం`అన్న‌మ‌య్య‌`(1997). అయితే.. ఆ సినిమా త‌రువాత నాగ్‌కి ఆశించిన విజ‌యాలు ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో.. నాగార్జున‌ని మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి తీసుకువ‌చ్చిన చిత్రంగా `నువ్వు వ‌స్తావ‌ని`కి ప్ర‌త్యేక స్థానం ఉంది.

* నాగార్జున‌, సిమ్ర‌న్ కాంబినేష‌న్‌లో రెండో చిత్ర‌మిది. ఇదివ‌ర‌కు `ఆటో డ్రైవ‌ర్‌`(1998)లో నాగ్‌కి జోడీగా సిమ్ర‌న్ న‌టించినా.. అది రెండో నాయిక పాత్రే. అయితే… `నువ్వు వ‌స్తావ‌ని`లో సిమ్రన్ సోలో హీరోయిన్ గా న‌టించింది. మాతృక‌లో త‌ను పోషించిన పాత్రే కావ‌డంతో అవ‌లీల‌గా అభిన‌యించింది.

* సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ బేన‌ర్ లోనూ, సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎ.రాజ్ కుమార్ కాంబినేష‌న్‌లోనూ నాగార్జున న‌టించిన తొలి చిత్ర‌మిదే కావ‌డం విశేషం.

* అలాగే కెరీర్‌లో ప‌లువురు నూత‌న ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించిన నాగ్‌.. ఈ చిత్రం ద్వారా వి.ఆర్‌.ప్ర‌తాప్‌కి ద‌ర్శ‌కుడిగా తొలి అవ‌కాశం ఇవ్వ‌డం మరో విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.