శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఢీ’ కు సీక్వెల్ రాబోతున్నట్టు గత రెండు రోజుల నుండి వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఢీ2 కి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. సమ్మర్ తర్వాత ఢీ 2 చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుందని వార్తలు జోరుగా వినిపించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వార్తల గురించి కొందరు సోషల్ మీడియా ద్వారా మంచు విష్ణుని సీక్వెల్ గురించి అడగగా… వారికి సమాధానంగా మంచు విష్ణు ఓ ట్వీట్ చేశాడు. `చాలా మంది నాకు ఫోన్ చేసి శ్రీనువైట్ల కాంబినేషన్‌లో `డీ2` స్టార్ అవుతోందట కదా అంటూ నాకు కంగ్రాట్స్ చెప్పారు. దీని గురించి నాకు అన్నలాంటి శ్రీనువైట్లగారిని అడిగితేనే బెటర్. ప్రాజెక్ట్ వివరాలకు సంబంధించినంతవరకు నన్ను ఇన్వాల్వ్ చెయ్యకండి` అని చెప్పాడు. మరి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నాడు కానీ.. సీక్వెల్ లేదు అని గట్టిగా చెప్పలేదు అంటే ఉన్నట్టే కదా.. చూద్దాం త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారేమో.




ప్రస్తుతం శ్రీను వైట్ల బాలయ్య సినిమాతో బిజీ గా వున్నాడు. మరోవైపు మంచు విష్ణు మోసగాళ్ళు అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. వారి సినిమాలు అయిపోయే లోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి.. ఈ సినిమాను పట్టాలెక్కిస్తారేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























