శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఇక ఆ సినిమా తర్వాత ఇద్దరూ ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ప్రస్తుతం పరిస్థితి వేరనుకోండి. విష్ణు హిట్ కొట్టి కొన్నేళ్లు అయిపోయింది. అలానే శ్రీను వైట్ల నుండి హిట్ వచ్చి చాలా కాలమైంది. ఇప్పుడు ఇద్దరికీ హిట్ చాలా అవసరం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి సందడి చేయడానికి రెడీ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త సినిమా కాకుండా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఢీ’ సీక్వెల్ చేయాలని చూస్తున్నారట.ఢీ2 కి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. సమ్మర్ తర్వాత ఢీ 2 చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు.





ప్రస్తుతం శ్రీను వైట్ల బాలయ్య సినిమాతో బిజీ గా వున్నాడు. మరోవైపు మంచు విష్ణు మోసగాళ్ళు అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. వారి సినిమాలు అయిపోయే లోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి.. ఈ సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. చూద్దాం మరి ఈగ్యాప్ లో ఎన్ని మార్పులు జరుగుతాయో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























