అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో.. వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో.. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇప్పుడు మరోసారి హీరోగా ‘నాంది’ అనే సినిమాతో మరో డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. రెండవ షెడ్యూల్ షూటింగును ఈ రోజున మొదలెట్టారు. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల అందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి సమ్మర్లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































