‘ఉప్పెన’ నుండి రాబోతున్న మొదటి పాట..!

Uppena Movie First Single Will Be Out Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Uppena,Uppena Movie,Uppena Telugu Movie,Uppena Movie Updates,Uppena Telugu Movie Latest news,Uppena Songs,Uppena Movie Songs,Uppena Telugu Movie Songs,Vaisshnav Tej

సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇటీవలే వైష్ణవ్, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. నీ కన్ను నీలి సముద్రం అంటూ సాగే మొదటి పాట మార్చి 2న సాయంత్రం గం.4.05ని.లకు విడుదల అవ్వనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మెగా హీరో అదృష్టం ఎలా ఉందొ తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.