మొదటి నుండి ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య దేవ్. ఇటీవలే జార్జిరెడ్డి సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సత్యదేవ్ తాజాగా మరో కొత్త సినిమాను లైన్‌లో పెట్టాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. కేరాఫ్ కంచరపాలెం లాంటి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన వెంకటేశ్ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన నిర్మాతలు ఈ సినిమాను తీస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
[custom_ad]




కాగా నరేశ్, సుహాస్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, టీఎన్‌ఆర్, రవీంద్ర విజయ్, రాఘవన్ ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన బిజిబల్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. 2016లో విజయం సాధించిన మలయాళ చిత్రం ‘మహేషింటే ప్రతీకారమ్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























