`ట‌క్ జ‌గ‌దీష్` షూటింగ్ అప్ డేట్

Tuck Jagadish Movie Team Releases An Interesting Update

`నిన్ను కోరి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా `ట‌క్ జ‌గ‌దీష్`. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లో జ‌గ‌ప‌తి బాబు ఓ కీల‌క పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించి తొలి షెడ్యూల్ పొల్లాచ్చి ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అక్క‌డ నాని, రీతూ, ఐశ్వ‌ర్య‌, వెన్నెల కిషోర్ త‌దిత‌రుల‌పై కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. మ‌రో వారం పాటు ఈ షెడ్యూల్ సాగుతుంద‌ని స‌మాచారం. ఆపై హైద‌రాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ జ‌రిపే దిశ‌గా ప్లానింగ్ జ‌రుగుతోంది.

కాగా, జూలై 3న `ట‌క్ జ‌గ‌దీష్‌` థియేట‌ర్ల‌లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముందని ప్ర‌చారం సాగుతోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + two =