కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు.. లేట్ గా వచ్చినా గట్టి హిట్ నే కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 2018 లో ‘ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న బన్నీ ఈ ఏడాది “అల వైకుంఠపురములో” సినిమాతో వచ్చాడు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టారు. సంక్రాంతి బరిలో దిగిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత ఎక్కడా తగ్గకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డ్స్ సృష్టించింది. హిట్ నుండి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ కు వెళ్లి నాన్ బాహుబలి రికార్డ్స్ ను సైతం వెనక్కినెట్టింది. ఇక ఈ సినిమా సక్సెస్ తో బన్నీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. అంతేకాదు టాలీవుడ్ లో వున్న దర్శకులందరికీ కూడా పెద్ద పార్టీనే ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా అల వైకుంఠపురములో సక్సెస్ అటు బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. తెలుగులో హిట్ ఐన సినిమాలను హిందీలో రీమేక్ చేయడం ఎప్పటినుండో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల వైకుంఠపురములో రీమేక్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
[custom_ad]




ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ముంబై లో కూడా బన్నీ ఇల్లు కొనే ప్లాన్ చేస్తున్నాడు. అక్కడ మీడియాతో ముచ్చటించిన బన్నీ.. నాకు ముంబై అంటే ఇష్టం అందుకే తరచూ ఇక్కడికి వస్తుంటా..అయితే ఇక్కడ నాకు ఇల్లు లేదు.. ఇప్పుడు నేను ఉన్నది గీతా ఆర్ట్స్ గెస్ట్ హౌస్.. అందుకే ఇక్కడ ఇల్లు కొనే ప్లాన్ చేస్తున్నా అని తెలిపాడు. మరి ఎలాగూ హిందీలో సినిమా చేయాలని చూస్తున్నాడు బన్నీ.. ఈ నేపథ్యంలో అక్కడ ఇల్లు కొంటే అన్నిటికీ ఉపయోగపడుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. మరి ఒక వేళ బన్నీ కనుక ఇల్లు కొంటే…. ఆ వెనుకే మన హీరోలు కూడా క్యూ కడతారేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























