“లవ్ స్టోరీ” ఏ పిల్లా సాంగ్ మ్యూజికల్ ప్రివ్యూ వీడియో

Love Story Movie Team Releases Ay Pilla Song Musical Preview Video

నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ” మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఒక సరికొత్త ప్రేమకథ గా రూపొందుతున్న “లవ్ స్టోరీ” మూవీ లో హీరో నాగచైతన్య తెలంగాణ యువకుడు గా నటించడం విశేషం. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“లవ్ స్టోరీ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్ , టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా “లవ్ స్టోరీ” మూవీ లోని ఏ పిల్లా సాంగ్ మ్యూజికల్ ప్రివ్యూ వీడియోను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. శేఖర్ కమ్ముల మార్క్ విజువల్స్ తో రూపొందిన మెలోడీ సాంగ్ ఏ పిల్లా ప్రోమో వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ “ఫిదా” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న “లవ్ స్టోరీ” మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 19 =