2020 వేసవిలో దాదాపు 15 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. మరీ ముఖ్యంగా.. ఒక్క మే నెల సంగతే తీసుకుంటే దాదాపు ప్రతీ వారం బిగ్ టికెట్ ఫిల్మ్స్ పలకరించనున్నాయి. మే 1 నుంచి మే 22 వరకు నాలుగు వారాల పాటు నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్లలో వినోదాల విందు పంచే అవకాశం కనిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. మే 1న విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న `నారప్ప` విడుదల కానుండగా.. అదే నెల 8న మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కాప్ స్టోరీ `క్రాక్` రిలీజ్ కానుంది. ఇక మే 15న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ `పింక్` రీమేక్ రిలీజ్ అవుతుందని ప్రచారం సాగుతోంది. అలాగే మే 22న కింగ్ నాగార్జున కొత్త చిత్రం `వైల్డ్ డాగ్` సందడి చేయనుందని సమాచారం. మరి… ఈ చిత్రాలలో వేటికి జనాదరణ దక్కుతుందో చూడాలి.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























