పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో “A1 ఎక్స్ ప్రెస్”

A1 Express Movie Team Gets Busy In Post Production Work

ప్రస్తుతం టాలీవుడ్ లో స్పోర్ట్ డ్రామా మూవీస్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ నేపథ్యం లో రూపొందిన “మజిలీ”, “జెర్సీ” మూవీస్ ఘనవిజయం సాధించడం తో టాలీవుడ్ నిర్మాతలు స్పోర్ట్స్ నేపథ్య మూవీస్ నిర్మించడానికి ఆసక్తిగా ఉన్నారు. గోపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో “సీటీ మార్ “, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రైఫిల్ షూటింగ్ నేపథ్యంలో “గుడ్ లక్ సఖీ ” మూవీస్ రూపొందుతున్నాయి. వరుణ్ తేజ్ బాక్సర్ గా ఒక మూవీ , విజయ్ దేవర కొండ మార్షల్ ఆర్ట్స్ మూవీ “ఫైటర్” (వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ ప్రారంభం కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా హాకీ క్రీడా నేపథ్యంలో రూపొందిన “A1 ఎక్స్ ప్రెస్” మూవీ షూటింగ్ పార్ట్ ముగించుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది. హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకొంటున్నారు. మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ
ముఖ్య పాత్రలలో నటించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన “A1 ఎక్స్ ప్రెస్” మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.