శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “జాను ” మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ సూపర్ హిట్ “96” మూవీ కి తెలుగు రీమేక్ గా “జాను” రూపొందింది. తమిళ మూవీ కి సంగీతం అందించిన గోవింద్ వసంత తెలుగు మూవీకి కూడా సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“జాను ” మూవీ టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “జాను ” మూవీలోని ఫస్ట్ సింగిల్ హార్ట్ టచింగ్ మెలోడీ లిరికల్ సాంగ్ “ప్రాణం”ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. ఇప్పుడు సెకండ్ సింగల్ “ఊహలే “లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. గోవింద్ వసంత స్వరకల్పనలో శ్రీమణి రచించిన “ఊహలే ” గీతాన్ని
చిన్మయి, గోవింద్ వసంత అద్భుతంగా ఆలపించారు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొంటూ సాగిన ఈ సాంగ్ విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























