`నార‌ప్ప‌`కి రిలీజ్ డేట్ ఫిక్స‌యిందా?

Venkatesh Narappa Gets A Final Release Date

త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అసుర‌న్`… తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ టైటిల్ రోల్ లో న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టిస్తున్న ఈ సినిమాకి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు. మాతృక‌ని నిర్మించిన క‌లైపులి ఎస్.థానుతో క‌ల‌సి డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే… ఇటీవ‌లే సెట్స్ పైకి వెళ్ళిన ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్ర‌స్తుతం మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. అంతేకాదు.. స‌మ్మ‌ర్ ని టార్గెట్ చేసుకున్న ఈ మూవీకి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింద‌ట‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. కార్మికుల దినోత్స‌వం సంద‌ర్భంగా మే 1న (మే డే) `నార‌ప్ప‌` విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే `నార‌ప్ప‌` రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.