హర్రర్ లో కూడా కామెడీని ఎలా పండించాలో చూపించిన దర్శకుడు మారుతి. తన కామెడీ టైమింగ్ తో హీరోలతో మంచి కమెడీ చేయించి హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గా మెగా హీరో సాయితేజ్ తో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుత జనరేషన్ లో మెకానికల్ లైఫ్ కి అలవాటు పడ్డ పిల్లలు తమని ఈ స్థాయికి తీసుకువచ్చిన తల్లితండ్రులను మరిచిపోతున్నారన్న నేపధ్యంలో చక్కటి కుటుంబ సన్నివేశాలతో సినిమాని తెరకెక్కించాడు మారుతి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇప్పుడు తాజా సమాచారం తన తర్వాత సినిమాపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అల్లు శిరీష్ తో కొత్త జంట, తేజ్ తో ప్రతిరోజూ పండగే సినిమా తీయగా.. మారుతి తదుపరి చిత్రాన్ని మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో చేస్తున్నాడన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గత ఏడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో మంచి హిట్టు కొట్టిన వరుణ్ తో ఓ సినిమాని చేసేందుకు మారుతి సిద్దం అయ్యాడని తెలుస్తుంది.ఇప్పటికే వరుణ్ , మారుతిల మధ్య కథ చర్చలు జరిగాయని.. సమ్మర్ లో సినిమా పట్టలేక్కనుందని సమాచారం. ఈ సినిమాకి కూడా గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ వారే నిర్మతాలుగా వ్యవహరించనున్నారట. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























