మొదటినుండి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ క్వీన్. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో ముందుకు వస్తుంది. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘పంగా’. ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొన్న కంగనా సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కంగనా రనౌత్ మాట్లాడుతూ… ‘‘పంగా’ సినిమాలో ఓ మధ్య తరగతి మహిళగా, అందులోనూ తల్లిగా నటించా.. తల్లి పాత్ర పోషించడం చాలా గొప్పగా అనిపించింది’’ అని కంగనా రనౌత్ అన్నారు. ‘అశ్విని మంచి డైరెక్టర్. పని పట్ల మంచి ఫోకస్, క్లారిటీ ఉంది. ‘పంగా’ చిత్రంలో నాది నేషనల్ లెవల్ కబడ్డీ క్రీడాకారిణి పాత్ర. ఆటకూ, కుటుంబ బాధ్యతలకూ మధ్య నలిగే పాత్ర. అప్పుడు ‘మణికర్ణిక’, ఇప్పుడు జయలలిత బయోపిక్ ‘తలైవి’ సినిమా చేస్తూ హైదరాబాద్, చెన్నై తిరుగుతూ పూర్తిగా సౌత్ ఇండియన్‌గా మారిపోయా. సౌత్ ఇండియాలో గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇక్కడి సినిమా కల్చర్ నాకు బాగా నచ్చింది’’ అన్నారు.
కాగా జస్సీ గిల్, రిచా చద్దా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను…. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మిస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























