ఒకే రోజు మెహరీన్ రెండు సినిమాలు రిలీజ్

Mehreen Busy With Sankranthi Releases

సక్సెస్ ఫుల్ మూవీ “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ భామ మెహరీన్ నటించిన మహానుభావుడు, రాజా ది గ్రేట్ మూవీస్ ఘన విజయం సాధించాయి. మెహరీన్ నటించినజవాన్, పంతం, నోటా మూవీస్ నిరాశ పరిచాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెహరీన్, తమన్నా హీరోయిన్స్ గా రూపొందిన “F2 ఫన్ &ఫ్రస్టేషన్ మూవీ 2019 సంవత్సరం సంక్రాంతి కి రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మెహరీన్ సంక్రాంతికి రెండు సినిమాలతో సందడి చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కుటుంబ కథా చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “ఎంత మంచివాడవురా”, ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్, మెహరీన్ జంటగా రూపొందిన తమిళ మూవీ “పట్టాస్”సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానున్నాయి. యంగ్ హీరో నాగశౌర్య కు మెహరీన్ జోడీ గా నటించిన
“అశ్వద్ధామ “మూవీ జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మెహరీన్ హీరోయిన్ గా నటించిన మూడు సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కావడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 6 =