సెవెన్ స్క్రీన్స్ స్టూడియోస్ బ్యానర్ పై సూపర్ హిట్ మూవీ “ఇమైక్క నోడిగళ్ ” దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం లో చియాన్ విక్రమ్ హీరోగా “కోబ్రా “తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “KGF ” మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, KS రవికుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“కోబ్రా ” మూవీ 50శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నట్టు సమాచారం. బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ జనవరి లో రష్యా , యూరోప్ లలో జరుపుకోనుంది. ఈ మూవీ లో విక్రమ్ 25 గెటప్స్ లో కనిపించడం విశేషం. “కోబ్రా ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. 2020 సమ్మర్ లో “కోబ్రా ” మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన తరువాత విక్రమ్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న “పొన్నియిన్ సెల్వన్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























