నటసింహ నందమూరి బాలకృష్ణకి అచ్చొచ్చిన స్వరకర్తల్లో చిరంతన్ భట్ ఒకరు. బాలయ్య వందో చిత్రం `గౌతమీపుత్ర శాతకర్ణి`(2017)కి చిరంతన్ నే బాణీలు అందించాడు. హిస్టారికల్ డ్రామాగా రూపొందిన సదరు సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనంతరం ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `జై సింహా` (2018) కూడా విజయతీరాలకు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కట్ చేస్తే… ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడో చిత్రంగా `రూలర్` తెరకెక్కింది. రేపు (డిసెంబర్ 20) ఈ సినిమా జనం ముందుకు రానుంది. మరి… ఏడాదికో విజయం అందుకుంటూ వస్తున్న బాలయ్య, చిరంతన్ కాంబినేషన్… `రూలర్`తోనూ ఆ పరంపరని కొనసాగించి హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.
కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన `రూలర్`ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























