2020 సెకండాఫ్ లో వెంకీ, త్రినాథ‌రావ్ న‌క్కిన‌ చిత్రం?

Venkatesh Trinadha Rao Nakkina New Movie On Sets In 2020,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Venkatesh New Movie in 2020,Victory Venkatesh Next Upcoming Movies 2020,Venkatesh Recent News About Movies

ఈ ఏడాది `ఎఫ్ 2`, `వెంకీమామ‌` చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాలు అందుకున్నారు విక్ట‌రీ వెంక‌టేష్‌. ఈ రెండు సినిమాలు కూడా మ‌ల్టీస్టార‌ర్స్ గా రూపొందిన‌వే కావ‌డం విశేషం. ఇదిలా ఉంటే… జ‌న‌వ‌రి నుంచి వెంకీ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అసుర‌న్` రీమేక్ గా తెర‌కెక్క‌నున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కి శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. శ‌ర‌వేగంగా ఈ చిత్రాన్ని పూర్తిచేసి, 2020 వేస‌విలో రిలీజ్ చేయాల‌ని యూనిట్ ప్లాన్ చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా, ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అయిపోగానే… వెంకీ మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. త్రినాథ‌రావ్ న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో వెంక‌టేష్ ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నారట‌. 2020 సెకండాఫ్ లో సెట్స్ పైకి వెళ్ళే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా డి.సురేష్ బాబు నిర్మిస్తార‌ని టాక్. వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో ఈ కాప్ స్టోరీ థియేట‌ర్ల‌లో సంద‌డి చేసే అవ‌కాశ‌ముంది. మ‌రి… 2019లోలాగే 2020లోనూ వెంకీ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకుంటారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.