`డాన్ శీను`, `బలుపు` చిత్రాల తరువాత మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `క్రాక్` పేరుతో రూపొందుతున్న ఈ కాప్ స్టోరీలో రవితేజకి జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుండగా… యువ సంగీత సంచలనం థమన్ బాణీలను అందిస్తున్నాడు. `ఠాగూర్` మధు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఇటీవలే పట్టాలెక్కిన `క్రాక్` ఇప్పటివరకు దాదాపు 25 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందని సమాచారం. కాగా, రీసెంట్ గా పాతబస్తీలో నైట్ ఎఫెక్ట్ లో సాగే ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించారని, రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో దృశ్యీకరించిన ఈ సన్నివేశం చిత్రంలో ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని వినికిడి.
`క్రాక్` 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























